Sunday, 14 September 2025

032


జీవితం ఎందుకు జీవితంలో ఏం చేయాలి జీవితం నుంచి ఏం పొందాలి అనే ప్రశ్నలు కొందరికి ఉంటాయి. వాటి గురించి ఆలోచిద్దాం. నువ్వు ఉన్నావు కాబట్టి ప్రపంచం ఉంది నువ్వు లేకపోతే ప్రపంచంలో లేదు. సో నువ్వు ఉన్నావు ప్రపంచం ఉన్నది. అంటే నువ్వు ఉన్నావు కాబట్టి నీలో నువ్వు ఉంటావు. ప్రపంచం ఉంది కాబట్టి ప్రపంచంలో నువ్వు ఉంటావు. ఇది సత్యం. దీన్నిబట్టి ప్రపంచంలో నువ్వు ఉన్నప్పుడు ఆనందంగా ఉండాలి నీలో నువ్వు ఉన్నప్పుడు అనుభవంతోటి ఉండాలి అని అనుభవజ్ఞులు జీవిత లక్ష్యాన్ని నిర్ణయించారు. జీవితం ఎందుకు అంటే ఆనందంగా అనుభవంతో ఉండగలగటం కోసమే. జీవితంలో ఏం చేయాలి అంటే బాహ్యంలో ఆనందాన్ని అంతరంగంలో అనుభవాన్ని పొందటానికి ప్రయత్నించటమే. జీవితంలో ఏం పొందాలి అంటే పెద్దలు నిర్ణయించిన జీవిత లక్ష్యమైన బాహ్య ఆనందాన్ని అంతరంగ అనుభవాన్ని. 

No comments:

Post a Comment