Sunday, 14 September 2025

034


మనిషికి వ్యక్తిత్వమే ప్రధానం అని అందరి భావన. ఆలోచనలు అభిప్రాయాలు అప్పటి వరకు ఉన్న అనుభవంతో వ్యక్తిత్వానికి మెరుగులు దిద్దుకుంటూ ఉంటారు. వ్యక్తిత్వానికి ఎదురు దెబ్బ తగిలితే వారి అహం దెబ్బ తింటుంది. ఎందుకంటే వ్యక్తిత్వం అంటే అహమే. అందుకనే అహం తగ్గాలి అంటే వ్యక్తిత్వాన్ని పెంచే ఆలోచనలు అభిప్రాయాలు ఉండకూడదు. కర్మనుసారం వ్యక్తిత్వం ఏర్పడుతూ మారిపోతూ ఉంటుంది. దాన్ని పట్టించుకోకూడదు. నేను నాది నాకు అంటూ మాట్లాడేదంతా మన అహంకారమే అని గుర్తుంచుకోవాలి. అహంకారం వల్లనే నిత్యజీవనంలో వచ్చే కష్టనష్టాల బాధ ఎక్కువగా ఉంటుంది. అందుకనే తను అనే భావనను పెంచే వ్యక్తిత్వంపై మోజును తగ్గించుకోవాలి. మర్చిపోకండి జీవితం కర్మానుసారం నడుస్తుంది తప్ప వ్యక్తిత్వాల ప్రకారం నడవదు. 

No comments:

Post a Comment