మనిషి పుట్టింది తనని తాను ఉద్ధరించుకోవడానికి. మరెందుకు కాదు. ఈ విషయాన్ని ప్రతి రోజు గుర్తు చేసుకోవాలి. తన మనసుకు అనిపించినట్టుగా వ్యక్తుల మీద వస్తువుల మీద విషయాలు మీద ప్రతిస్పందిస్తే జీవితం నరకప్రాయం అవుతుంది. తనని తాను ఉద్ధరించుకోవడం అంటే తనకు కలిగే అభిప్రాయాలను తనకు కలిగే ఆలోచనలను అదుపు చేసుకోవటం. వ్యక్తుల వల్ల వస్తువుల వల్ల విషయాల వల్ల తన జీవితంలో ఏర్పడే సంఘటనలకు సంబంధాలకు తాను గాని ఇంకెవరు గాని కర్తలు కాదు అన్న విషయాన్ని కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. తన శరీరం వల్ల తన మనసు వల్ల తనకేదో గొప్పతనం ఉంది అని అనుకోవడం వల్లనే జీవితం మొత్తం సంఘర్షణగా మారిపోతుంది. గుర్తుపెట్టుకోండి, మీరు సరిగ్గా ఉంటేనే మీరు ఆనందంగా ఉంటారు.
No comments:
Post a Comment