మనసుకి రెండు ముఖాలు.
ఒకటి exitement .. అంటే ఉత్తేజం.
రెండోది depression .. అంటే ఉద్వేగం.
దృశ్యశ్రవణాల్లో ఏదో ఒకటి (లేదా రెండూ) ..
అపూర్వం అనిపిస్తే అది ఉత్తేజం.
అరరే లేదా అయ్యో అనిపిస్తే అది ఉద్వేగం.
ఉత్తేజం అంటే ఏమిటి? మనసు సమూహంలో ఉత్తేజాన్ని కోరుకుంటుంది. ఎందుకంటే ఉత్తేజానికి ఆకర్షణ ఎక్కువ కాబట్టి. కాబట్టే అందరూ రూపం (అందం) ఇష్టపడతారు. అందుకే గ్రూపుల్లో దృశ్యాలు (ఫోటోలు), వాటికి likes ఎక్కువుంటాయి. ఇక శ్రవణం. అంటే మాటలు, పంచ్ కొటేషన్లు లాంటివి .. Inspiration అనీ, motivation అనీ share చెయ్యడం.
ఈ రెండూ మనస్సుకు పనికిరావు.
ఇక ఉద్వేగం అంటే ఏమిటి. మనసు ఒంటరితనంలో ఉద్వేగాన్ని ఆశ్రయిస్తుంది. ఎందుకంటే ఉద్వేగానికి గుర్తింపు ఎక్కువ కాబట్టి. ప్రపంచం (లో) ఏదో అయిపోతుందని బాధ పడడం 'గుర్తింపు' కోరుకోవడమే. అన్నదానాల ప్రచారం, ఉద్వేగభరితమైన ప్రసంగాలు, వర్షంలో వృద్ధులకు గొడుగు పట్టడం, జంతువులను కాపాడడం వంటివి మనిషిలో ఉద్వేగాన్ని తట్టి లేపేవే. ఇలాంటివి share చేసుకోవడం మనసుకు అస్సలు పనికిరాదు.
మనసుకు ఉత్తేజం, ఉద్వేగం కలగనీయకుండా నిత్య జీవనాన్ని నియమబద్ధం చేసుకోవడమే "అభ్యాసం". దృశ్య శ్రవణాలు అభ్యాసానికి అవరోధాలు. ఈ సత్యాన్ని మర్చిపోవద్దు. అలాంటి సత్య సాంగత్యం(సత్సాంగత్యం) లో కృష్ణుడు చెప్పిన అభ్యాసానికి ఈ రోజున అంకురార్పణ చేద్దాం.
No comments:
Post a Comment