Tuesday, 19 August 2025

016

ఎవరి జీవితంలోనూ గుడ్ టైం బ్యాడ్ టైం అనేవి ఉండవు. ఎదురైన పరిస్థితులకు అనుగుణంగా తలవంచి నడుద్దాం అనుకోవడం గుడ్ టైం. ఎదురైన పరిస్థితులకు లొంగకుండా తల ఎత్తి నిలబడదాం అనుకోవటం బ్యాడ్ టైం. ఏ పరిస్థితి అయినా అది నిన్ను సుఖపెట్టడానికో బాధ పెట్టడానికో రాదు. కేవలం నిన్ను సరిదిద్దడానికి వస్తుంది. అందుకనే పరిస్థితి మంచిగా చెడ్డదా అని ఎంచి చూడటం చాలా తప్పు. కష్టాలు ఎవరికైనా వస్తాయి అందరూ అంబానీలు కాదు. ఏమీ లేని వాళ్లు అంతకంటే కాదు. కష్టసుఖాలు అనేవి మైండ్ సెట్ ని బట్టి ఏర్పడతాయి. అయినా జీవితం ఉన్నది నువ్వు హాయిగా గడపటానికి కాదు. నిన్ను నువ్వు కష్టపడి మార్చుకోవడానికి. ఎందరు గురువులు ఉపదేశాలు చేసిన ఎంతమంది జ్యోతిష్యులు భవిష్యత్తు చెప్పిన నీ జీవితాన్ని నువ్వే అర్థం చేసుకోవాలి ఆ జీవితాన్ని సార్ధకం చేసుకునే పనులను నువ్వే చేసుకోవాలి. ఇంకో మార్గం లేనేలేదు. 

No comments:

Post a Comment