Saturday, 23 August 2025

020


కొంతమంది ప్రపంచాన్ని ఆసరాగా చేసుకుని తన కోరికలను తీర్చుకుంటూ హాయిగా ఉంటారు. దీన్ని లాజికల్ లైఫ్ అంటారు. మరి కొంతమంది తమ కోరికలు తీర్చుకోవటానికి అచ్చంగా దేవుని మీద ఆధారపడి ఉంటాడు. దాన్ని స్పిరిట్యువల్ లైఫ్ అంటారు. ఇద్దరికీ జీవితంలో కష్టనష్టాలు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే అప్పుడప్పుడు కష్టనష్టాలు వస్తూ ఉండటమే జీవితం. అలా కష్టాలు మీద పడినప్పుడు లాజికల్ లైఫ్ లో ఉన్న వ్యక్తి దేవుడుని నమ్మకంతో ప్రార్థిస్తాడు. ఆ నమ్మకానికి అనుగుణంగా ఫలితం రాకపోతే దేవుడికి జాలి లేదు అనుకుంటాడు. కానీ స్పిరిట్యువల్ లైఫ్ లో ఉన్న వ్యక్తికి కష్టాలు వస్తే ప్రత్యేకంగా దేవుడుని ప్రార్థించడు. కష్ట సమయంలో భగవంతుడు అండగా ఉంటాడు అన్న ధైర్యంతో ఉంటాడు. అందుకే పరిస్థితులు ఎలా ఉన్నా కూడా మనిషి హాయిగా ఉండాలి అంటే నమ్మకంతో కాకుండా ధైర్యంతో స్పిరిట్యువల్ లైఫ్ ని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. 

No comments:

Post a Comment