నేను నాది అనే ఆలోచనతోనే మనిషి తన జీవితాన్ని నిర్మించుకుంటున్నాడు. అయితే ఏది నేను ఏది నాది అనేదాన్ని తెలుసుకోవడానికి ఒక్క క్షణం కూడా ప్రయత్నించటం లేదు. నేను అని శరీరాన్ని నాది అని మనసుని అనుకుని భ్రమ పడుతున్నాడు. అయితే శరీరానికి వచ్చే వయసుని మనసుకి వచ్చే కోరికలని ఆపలేము కాబట్టి ఆ రెండిటితో తనకు ప్రత్యక్ష సంబంధం లేదు అని తెలుసుకోలేకపోతున్నాడు. ఈ శరీరము నేను కాదు ఈ మనసు నాది కాదు అనేటువంటి ప్రాథమిక జ్ఞానాన్ని వంట పట్టించుకోవటానికి ప్రయత్నం చేయకపోవటమే అహంకారం. అందుకనే కష్టాలు వచ్చాయని బాధపడుతున్న ప్రతి వ్యక్తిని అహంకారి అంటుంది వేదాంతం. అంటే నేను నాది అనే పదాలకి సరైన అర్థాలు తెలిస్తే ఎవరు కష్టాలను తలుచుకుని బాధపడరు. జీవితంలో అప్పుడప్పుడు కష్టనష్టాలు వస్తూనే ఉంటాయి అని అంగీకరించి వాటిని బాధ్యతగా సరిదిద్దుకుంటూ ఆనందంగా ఉంటాడు
No comments:
Post a Comment