Thursday, 21 August 2025

018


ఎలా జీవించాలి అన్న విషయాన్ని అందరూ మర్చిపోతున్నారు. చదువు సంపాదన పెళ్లి కుటుంబం వృద్ధాప్యం మరణం ఇదే జీవితమంటే అన్న భావన అందరిలో పాతుకు పోయింది. ఇది కాదు అని చెప్పిన వాళ్ళని ఎవరు తమ గ్రూపుల్లో చేర్చుకోవటం లేదు. కష్టాలు వచ్చినప్పుడు జ్యోతిష్యులని, గ్రహాలు బాగా లేదని తెలిస్తే గురువులని నమ్ముకుంటు కాలం గడిపేస్తున్నారు. మన సంస్కృతిలో భాగంగా ఉన్న జీవన విజ్ఞానాన్ని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కొత్త తరాలు మరిచిపోయాయి. సెల్ ఫోన్లు గొడ్డు చాకిరీ ఉద్యోగాలు సమయా సమయాలు లేని వినోదాలు మనిషి జీవితాన్ని శాసిస్తున్నాయి. పుట్టాం కాబట్టి బతుకుతున్నాం అనుకునే వాళ్లే ఎక్కువమంది. పుట్టింది ఇలా బతకటానికి అని తెలిసిన వాళ్ళు తక్కువమంది. ఈ నిష్పత్తి మారాలి. ఇలా జీవించటం కోసం పుట్టాం అని తెలిసిన వాళ్ళు ఎక్కువ మంది అవ్వాలి. జీవితం అంటే ఇది అని అందరూ ఆచరించి చూపించాలి. 

No comments:

Post a Comment