తనను ఉద్దరించుకోవటానికి ఈ ప్రపంచం ఉంది తప్ప ఈ ప్రపంచాన్ని ఉద్ధరించడానికి తను లేడు అన్నది సత్యం. అంతేకాదు ఈ ప్రపంచం నీ కలలను సాకారం చేయదు, ఆ బాధ్యత ప్రపంచాన్ని కాదు. నీ కలలను నీవే సాకారం చేసుకోవాలి. అందుకు వీలుగా ఈ ప్రపంచం ఉంది అంతే. ఈ ప్రపంచంలో నువ్వున్నా లేకపోయినా ప్రపంచం పట్టించుకోదు. ఈ సత్యాన్ని స్పష్టంగా అర్థం చేసుకుంటే మనిషికి ప్రపంచంలో ఉన్న దూకుడు 90 శాతం తగ్గిపోతుంది. గుర్తుపెట్టుకోండి ప్రపంచానికి సంబంధించిన ఏ విషయము మనిషికి ఆనందాన్ని ఇచ్చేది కాదు. అందుకే ప్రాపంచిక విషయాలపై దృష్టి పెట్టడం వల్ల జీవిత సమయం వృధా అవుతుంది అని పెద్దలు చెప్పారు. డబ్బు, వినోదం, సుఖం ఎరగా వేసి ప్రపంచం ఎప్పుడూ మనిషిని ఆకర్షిస్తూ ఉంటుంది. మనిషి సంయమనంతో వాటికి దూరమై అంతరంగంలో ఆధ్యాత్మికానికి చేరువ అవ్వాలి.
No comments:
Post a Comment