కాలక్రమంలో కొందరు మహానుభావులు ఆ అనుభవ సారాన్ని అక్షర స్వరాల్లో పొందుపరిచారు. అలా పొందుపరిచిన సంకలనమే .. అనేకమంది అనుభవజ్ఞుల జీవన సారమైన .. "వేదం". ఇది మలిదశ అని చెప్పుకోవాల్సిన వేద కాలం.
తొలి దశలో ఉన్నవారు ప్రాచీన ఋషులు,
మలిదశలో ఉన్నవారు వేద ఋషులు.
ఈ ఇద్దరి సమగ్ర అనుభవమే వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, శాస్త్రాలు, దర్శనాలు ఇత్యాది గ్రంథాలు. ఈ సమస్త వాఙ్గమయానికి సాక్షి వేద వ్యాసుడు.
ద్వాపర యుగం వరకు ఉన్న వ్యాసునికి కలియుగంలో ఉత్తరాధికారి ఆది శంకరులు. ఆయన జగద్గురువుగా వేద వాంగ్మయమే పునాదిగా చేసిన ప్రబోధం గత పాతికేళ్లలో మొద్దుబారింది. ఈ కాలంలోనే మత గ్రంథాలపై తర్కం పెరిగి, ఆధ్యాత్మ ఆచరణపై పట్టు తగ్గింది.
దీంతో జెన్ జీ యువత మత గ్రంథాలపై విముఖత పెంచుకుంది. జీవన నియమాలను వివరించే ఆధ్యాత్మికతను మత కార్యక్రమాలు గా భావించి కొట్టి పారేస్తోంది. ఈ నేపథ్యంలో గ్రంథాలు అంటే "అనుభవం" పొందే మార్గాలు అని చెప్తూ ఆధ్యాత్మ ఆచరణ వైపు నేటి తరాన్ని నడిపించాలి.
Very true.
ReplyDelete🙏
ReplyDelete