జెన్ జీ, ఆల్ఫా జీ పిల్లలు పెద్దల మాట వినటం మానేశారు. ఆ పిల్లల ఆలోచనల, ప్రవర్తనల ధోరణికి వారి తల్లిదండ్రులు ఇప్పటికే చేతులెత్తేశారు. అసలు విషయం ఏమిటి అంటే పై రెండు తరాలు సృష్టించుకునే ప్రపంచంలో ఆధ్యాత్మికం అపహాస్యం అవుతోంది. ఈ పరిస్థితి మారకపోతే పెద్దయ్యాక వారు జీవితాన్ని ఎలా నెగ్గుకు వస్తారో అనే భయం కలుగుతోంది.
మా జీవితానికి మీ అనుభవం ఎందుకు అనేటువంటి విశృంఖలత వారిలో బలపడిపోయింది. ఇది సరైన లక్షణం కాదు. ఎందుకంటే జీవితాన్ని ఎవరు ఎంత ఆధునికం చేసుకున్నా, జీవన నియమాలు మాత్రం ఎన్ని వేల సంవత్సరాలు గడిచినా మారవు. శాశ్వతమైన అలాంటి జీవన నియమాలను ఆచరణాత్మకంగా సొంతం చేసుకునే విధానానికే "ఆధ్యాత్మికం" అని పేరు.
ఇప్పుడు కాదు 2050 లో పుట్టిన పిల్లలైనా సరే భగవంతుడిని కళ్ళతో చూడలేరు, ఆనందాన్ని అంగట్లో కొనుక్కోలేరు. అది సృష్టి నియమం. అంతే. ఏ మనిషైనా సరే, ఎప్పుడు పుట్టిన సరే ఆనందం యొక్క అనుభూతి లేకుండా, భగవంతుని యొక్క అనుభవం లేకుండా ప్రశాంత జీవనాన్ని సాగించలేడు. ఇది సత్యం.
అందుకే కొత్త తరం పిల్లల పోకడ చూస్తుంటే భయం వేస్తోంది. వారిలో "ఆధ్యాత్మ" బీజాలు నాటటానికి వారి తల్లిదండ్రుల వల్ల కూడా కావడం లేదు. ఈ నేపథ్యంలో పాత తరాలు కొత్త ఆధ్యాత్మ శైలిని సిద్ధం చేసి తీరాలి. కొత్త తరాల భావాలను ఆకర్షించే విధంగా "ఆధ్యాత్మ" భాషను కూడా సరిదిద్దుకోవాలి.
No comments:
Post a Comment