నిత్య జీవితంలో మనిషి భగవంతుడిని ఆసరాగా చేసుకోవాలి. భగవంతుడు ఎవరు మనకు ఆసరాగా ఎలా ఉంటాడు అందుకోసం మనం ఏమి చేయాలి అనేవి అనుభవజ్ఞులు స్వానుభవంతో నిర్ణయించారు. ఆ విధానాన్ని అందరూ ఎప్పటికీ అనుసరించాల్సిందే. తన వీలుని బట్టి తన అవకాశాన్ని బట్టి తన అభిప్రాయాన్ని బట్టి భగవంతుడిని నా వాడు అని అనుకున్నంత మాత్రాన భగవంతుడు ఎన్నడూ ఎవరికి ఆసరాగా ఉండలేడు. ఎందుకంటే భగవంతుడు మనిషి అనుభవానికి ప్రాపంచిక అవకాశానికి సంబంధించిన వాడు కాదు. నిష్ట నిశ్చలత అనేవి వ్యక్తిత్వం సహా ఆరాధనలోనూ ప్రతిబింబించే భక్తికి తప్ప నమ్మకాలకు మొక్కులకు మురిసిపోయి ఆసరాగా వచ్చేటటువంటి వాడు భగవంతుడు కాదు. అది కేవలం మానసిక బలం. కాల ప్రభావంలో కొట్టుకుపోయే మానసిక బలానికి కాలానికి అతీతంగా ఉండే భగవంతుని అనుగ్రహానికి ఉన్న తేడా ఏమిటో అందరూ తెలుసుకోవాలి.
No comments:
Post a Comment