ఏ మనిషికైనా ఈ ప్రపంచంలో అత్యంత ఇష్టమైనది తను. తను అంటే శరీరము మనసు అని భావించుకుని గర్వపడుతూ ఉంటాడు. ఆ గర్వాన్ని అహం అంటారు. ఓ వయసు వచ్చేసరికి ఇప్పుడు నేను ఏం చేయాలి అనుకుంటాడు. ఈ ప్రశ్న చాలా సముచితమే అయినా నేను అంటే శరీరం మనసు అని అనుకోవటమే అనుచితం. నిజానికి శరీరం మనసుతో ఎవరు ఏమి చేయక్కర్లేదు అదే జరిగిపోతూ ఉంటుంది దాన్నే కర్మ అంటారు. శరీరము మనసు కాకుండా మిగిలి ఉన్న నేను తో ఏమి చేయాలి అనేదే అసలు ప్రశ్న. ఆ ప్రశ్న అందరూ వేసుకోవాలి. శరీరము మనసు నుంచి నేను అనే భావనను తప్పించటమే ప్రతి ఒక్కరూ చేయాల్సిన ఒకే ఒక్క పని. కష్టసుఖాలు శీతోష్ణాలు రాగద్వేషాలు అనే ద్వంద్వాలన్నీ కూడా ఈ శరీరము మనసుకి సంబంధించినవే. కాబట్టి ఎప్పుడైతే శరీరము మనసు నుంచి నేను అనే భావన అంటే అహం తొలగిపోయిందో కష్టాలు బాధలు ఉండవు. జీవితం హాయిగా ఉంటుంది.
No comments:
Post a Comment