శరీరానికి కష్టమైన పని క్రమశిక్షణలో నడవడం, మనసుకి కష్టమైన పని నియమంలో ఉండటం. అందుకే 8 ఏళ్ల బాల్యం తర్వాత పిల్లలకు శారీరక దృఢత్వం మానసిక నిబ్బరం పెరిగే విధంగా విలువలతో కూడిన జీవన శిక్షణ ఇవ్వాలి. ఇప్పటి తల్లిదండ్రులు ఈ రెండిటిని విస్మరించి కేవలం మేధస్సును పెంచే శిక్షణ మాత్రమే ఇస్తున్నారు. మేధస్సుకు విలువలకు సంబంధం లేని కారణం వల్లనే నేటి యువత శారీరక మానసిక ఒత్తిడిని తట్టుకోలేక పోతోంది. ముఖ్యంగా విలువలతో కూడిన బంధాలు లేక కుటుంబ వ్యవస్థ బలహీనమైంది. భగవంతుడిని ప్రార్థిస్తే బంధాలు బలపడవు. సంకల్ప బలంతో నిత్యజీవనంలో విలువలను పాటించాలి. అప్పుడే శారీరక మానసిక ఆటుపోట్లను తట్టుకునే శక్తి పెరుగుతుంది. గుర్తుపెట్టుకోండి మనిషికి ఆనందాన్ని ఇచ్చేది పాఠశాలలు పెంచే మేధస్సు కాదు, అమ్మానాన్నలు నేర్పించే జీవన విలువలు మాత్రమే.
No comments:
Post a Comment