శరీరానికి మనసుకి సంబంధం లేకుండా అనుభవ రూపంలో నేను అనేది ఈ శరీరంలో ప్రకాశిస్తూ ఉంటుంది. కానీ మనిషి ఈ శరీరాన్నే నేను అంటున్నాడు. ఈ పొరపాటుని సరిదిద్దుకోవాలి. శరీరం బాహ్యమైన నాలుగు అవసరాలతో కదులుతూ ఉంటుంది. అవి ఆహారం భయం నిద్ర శృంగారం. ఇదే శరీరానికి అంతర్లీనంగా ఎన్నో యోగ సామర్థ్యాలు ఉన్నాయి. సూత్రం ఏమిటంటే ప్రకృతి సమకూర్చిన శరీరానికి అవసరాలను ప్రకృతి తీరుస్తుంది, కానీ యోగ సామర్ధ్యాలను మనిషే సాధించుకోవాలి. అయితే ఆ మనిషి శరీరం నాదే శరీరం నేనే అనే భ్రమలో శరీర అవసరాలను తీర్చుకుంటూ అదే జీవితం అనుకుని కష్టనష్టాల్లో కొట్టుకుని పోతున్నాడు. జీవితంలో సుఖసంతోషాలు నిండాలంటే ఈ శరీరం నేను కాదని ఈ శరీరంలో నేను ఉన్నానని మనిషి గ్రహించాలి. అప్పుడే శరీరానికి ఉన్న ఎన్నో యోగ సామర్థ్యాలను పొంది మనిషి ఋషి అవగలడు.
No comments:
Post a Comment