Thursday, 28 August 2025

024


వేదాంతం అంటే ఒక విజ్ఞాన శాస్త్రం. ఫిజిక్స్ అంటే భౌతికశాస్త్రం కెమిస్ట్రీ అంటే రసాయన శాస్త్రం అన్నట్టు వేదాంతం అంటే ఆనంద శాస్త్రం. మనిషి తన జీవితంలో ఆనందాన్ని నింపుకోవటానికి ఆచరించాల్సిన విధానం పేరే వేదాంతం. వేదాంతి అంటే పరిస్థితులు ఎలా ఉన్నా అంతరంగంలో ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నవారు అని అర్థం. ఒక మనిషి తన జీవితంలో కష్టనష్టాలకు మానవమానాలకు ఆటుపోట్లకు బాధపడు తున్నాడు అంటే వేదాంత జీవన విధానానికి దూరంగా ఉన్నాడు అని అర్థం. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని సాధనలు చేసినా ఎన్ని విద్యలు నేర్చుకున్నా అనుభవంలోకి రాని ఆంతరంగిక ఆనందం జీవన తృప్తి కేవలం వేదాంత జీవనంలో మాత్రమే లభిస్తుంది. ఈ వేదాంత జీవనం భారత దేశంలో మాత్రమే వంట పడుతుంది. వేదాంతం అంటే సిద్ధాంతం కాదు అన్ని దేశాల్లోనూ వ్యాప్తి చేయటానికి. వేదాంతం అంటే జీవన విధానం అడుగడుగునా తెలుసుకుని నేర్చుకుని అనుభవం లోకి తెచ్చుకోవాలి. 

No comments:

Post a Comment