Thursday, 28 August 2025

025


మన వేదాంతము ఆధ్యాత్మిక సాధనలు గురువులు చెప్పేది ఒకటే మనసు స్వభావాన్ని మార్చుకోండి అని. శరీరానికి ఉన్న ఆహారము భయము నిద్ర శృంగారము అనే అవసరాలతోటి కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు అనేవి ప్రకోపించటమే మనసు స్వభావం. దీన్ని మార్చుకోమని తత్వ వాంగ్మయం బోధిస్తోంది. మనసు మంచిదైనంత మాత్రాన మనిషికి విలువ ఉండదు. మనసు స్వభావాన్ని మార్చుకున్న మనిషి ఒక్కడే మహనీయుడు. సనాతనులు ప్రతిపాదించిన జీవన విలువలను ఆచరిస్తే మనసు స్వభావం మారుతుంది. అందుకే భారతీయ జీవనశైలికి ప్రపంచవ్యాప్తంగా అంత ఆదరణ ఉంది. కొత్త తరాలకు ఆ జీవన విలువలను పరిచయం చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంది అని గుర్తు చేయటమే మన కర్తవ్యం. 

No comments:

Post a Comment