Sunday, 31 August 2025

028


మనిషి జీవితంలో రెండు భాగాలు ఉంటాయి. ప్రధానమైన మొదటి భాగం ఏంటి అంటే గతంలో చేసుకున్న పనులకు ఇప్పుడు ఫలితాన్ని అనుభవిస్తూ ఉండటం. దాన్ని జీవితం అంటారు. రెండో భాగం ఏంటంటే ఆ ఫలితాన్ని అనుభవిస్తూ ఇప్పుడు పాటించే జీవన విధానం. దాన్ని జీవనశైలి అంటారు. ఫలితాన్ని అనుభవించడంలో అంటే జీవితంలో సుఖదుఃఖాలు ఉంటాయి. వాటి తీవ్రత జీవించే విధానంలో అంటే జీవనశైలి ప్రకారం ఉంటుంది. ఇక్కడ నమ్మాల్సిన విషయం ఏంటంటే జీవితాన్ని ఎవ్వరూ మార్చుకోలేరు కానీ జీవనశైలిని మార్చుకోవచ్చు. దానివల్ల ఫలితం అనుభ వించడంలో అంటే జీవితంలోని సుఖదుఃఖాల తీవ్రతలు బాగా తగ్గుతాయి. అందుకనే జీవితం అనేది ఎక్కువ ఇబ్బందులు లేకుండా ఉండటానికి వీలైనటువంటి జీవనశైలి ఇలా ఉండాలి అని సనాతనులు చెప్పారు. అదేమిటో తెలుసుకొని పాటించాల్సిన బాధ్యత అందరిదీ. 

No comments:

Post a Comment