మనిషి వయసుతో నిమిత్తం లేకుండా అవకాశం దొరికినప్పుడల్లా జీవన విలువలు ఏమిటో తెలుసుకుంటూ వాటిని వంట పట్టించుకోవాలి అంతేకాదు అవకాశం దొరికినప్పుడల్లా ఆ విలువలను మరొకరికి అందించాలి. ఇలా మనం నేర్చుకోవాలి మరొకరికి నేర్పించాలి అనే ఈ భావన వల్ల సహజీవనంలో ఐకమత్యం పెరుగుతుంది. ప్రపంచంలో సుఖవంతంగా జీవించటం గొప్పకాదు అంతరంగంలో జీవన విలువలు పెంచుకోవడం విశేషం. ప్రతిక్షణం మంచి చెడుల ఘర్షణలో ఉండే జీవితంలో శారీరక మానసిక పట్టుత్వంతో మనం జీవించాలని మనలా జీవించే కొత్త తరాన్ని తయారు చెయ్యాలని ప్రతి ఒక్కరికి ఉండాలి. పైపైన పులుముకున్న అలంకారంలా కాకుండా మనిషి స్వభావంలోనే జీవన విలువలు కలిసిపోయేటటువంటి జీవనశైలిని మనం నేర్చుకోవాలి మరొకరికి నేర్పించాలి.
No comments:
Post a Comment